News August 22, 2024
VJA: బాలికతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన
విజయవాడలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశామని టూటౌన్ సీఐ కొండలరావు తెలిపారు. విజయవాడ కొత్తపేటకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో చదువుతోంది. అదే స్కూల్లో పనిచేస్తున్న హేమంత్ అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News November 25, 2024
గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై BIG UPDATE
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూంలల్లో ఎటువంటి హిడెన్ కెమెరాలు లేవని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల వద్ద కూడా ఎటువంటి బాత్రూం ఫొటోలు గానీ, వీడియోలు గానీ లేవని స్టేట్ ఫోరెన్సిక్ లేబరేటరీస్ పరీక్ష ద్వారా నిర్ధారణ అయినట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఎస్పీ గంగాధరరావు సంయుక్తంగా సోమవారం తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
News November 25, 2024
కృష్ణా: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో సెప్టెంబర్- 2024లో నిర్వహించిన ఎంఎస్సీ- బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఆక్వా కల్చర్, ఫుడ్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవచ్చు.
News November 25, 2024
ఉపాధి కల్పనలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా 4వ స్థానం
ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా కృష్ణాజిల్లాలో 14,729 యూనిట్లు రూ.491.88కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిపై మీ కామెంట్