News March 14, 2025
VJA: బాలికను వేధిస్తున్న యువకుడు.. కేసు నమోదు

బాలికను పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కంపూడికి చెందిన ఓ బాలిక(17)ను అదే ప్రాంతానికి చెందిన వేణుతో గతంలో మాట్లాడేది. ఇటీవల బాలిక కుటుంబ సభ్యులు వేణుని హెచ్చరించి మరోసారి బాలిక జోలికి రావద్దంటూ పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నారు. కానీ వేణు పెళ్లి చేసుకుంటానని వెంట పడడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 23, 2026
ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి నాలుగేళ్లు

ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి రేపటితో నాలుగేళ్లు పూర్తికానున్నాయి. 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడులకు ఆదేశించారు. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు ఉంది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 14,999 మంది పౌరులు మరణించినట్లు UN తెలిపింది. 59లక్షల మంది పౌరులు విదేశాలకు వలస వెళ్లిపోయారు. 1.40లక్షల మంది ఉక్రెయిన్ సైనికులు, 3.25లక్షల మంది రష్యా జవాన్లు చనిపోయినట్లు సమాచారం.
News February 23, 2026
కరీంనగర్ పోలీస్ దళంలోకి రెండు కొత్త డాగ్స్

నేర పరిశోధనను మరింత వేగవంతం చేసేందుకు కరీంనగర్ కమిషనరేట్ పోలీస్ దళంలోకి రెండు నూతన పోలీస్ డాగ్స్ చేరాయి. HYD లోని ఐ.ఐ.టి.ఏ (IITA) కేంద్రంలో 9 నెలల పాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న రోలెక్స్ (ట్రాకర్), మాక్స్ (స్నిఫర్) పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశాయి. వీటి రాకతో జిల్లాలో భద్రత వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు.
News February 23, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➤పలాస:గూడ్స్ రైలుకు తప్పిన పెనుప్రమాదం
➤శ్రీకాకుళంలో ప్రబలిన డయేరియా
➤శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్ కు 51 వినతులు
➤ఇచ్ఛాపురం: ఏసీబీ వలలో ఎంఈఓ
➤జిల్లాలో పలుచోట్ల అంగన్వాడీల నిరసన
➤శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 662 మంది గైర్హాజరు
➤టెక్కలి: ఆటో-బైక్ ఢీ..ఆరుగురికి గాయాలు
➤జిల్లా వ్యాప్తంగా ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమాలు


