News November 29, 2025
VJA: భవానీ దీక్ష విరమణ.. 3 వేల మందితో బందోబస్తు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమాలకు 3 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని నియమించడంతో పాటు, పరిసర ప్రాంతాల పర్యవేక్షణకు 300కు పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
Similar News
News December 4, 2025
జిల్లాలో 53 టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53 మంది అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లు నియామకం కోసం ఆదేశాలు జారీ చేశామని డీఈవో సలీం భాష గురువారం తెలిపారు. ఔత్సాహికులు శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీటిని సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. స్కూల్ అసిస్టెంట్‌కు రూ.12,500, SGTకి రూ.10 వేలు పారితోషకం చెల్లిస్తామన్నారు. జిల్లాలో 53 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తామన్నారు.
News December 4, 2025
తిరుపతి: సరికొత్త లుక్‌లో పవన్ కళ్యాణ్..!

చిత్తూరులో DDO ఆఫీస్ ఓపెనింగ్ నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. సరికొత్త లుక్‌లో ఆయన కనిపించారు. జవాన్ స్టైల్లో షార్ట్‌గా క్రాప్ చేయించారు. ఫుల్ హ్యాండ్స్ జుబ్బాలో స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నం చేశారు. గతంలో ఆయన ఆర్మీ ప్యాంట్, బ్లాక్ టీషర్టుతో తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


