News December 10, 2025
VJA: భవానీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ల ఏర్పాటు

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ సందర్భంగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయకుడి గుడి నుంచి టోల్‌గేట్ మీదుగా కొండపై ఓం టర్నింగ్ వరకు 3 క్యూలైన్లు, ఓం టర్నింగ్ వద్ద అదనపు లైన్‌లతో కలిపి 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షల విరమణ రోజుల్లో టికెట్ దర్శనాలకు అనుమతి లేదు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా దిగివెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Similar News
News December 14, 2025
పెద్దపల్లిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు: DCP

పెద్దపల్లి జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు. అంతర్గం మండలం కుందన్పల్లి, పెద్దంపేట్, ఎల్లంపల్లి, మూర్ముర్, గోళీవాడ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతా చర్యలు, సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై సమీక్షించారు. ప్రజలు భయాందోళనలేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని కోరారు.
News December 14, 2025
బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .


