News January 3, 2025

VJA: మద్యం తాగే చోటు కోసం ఘర్షణ.. వ్యక్తి హత్య

image

మద్యం తాగే చోటుతో వచ్చిన వివాదం హత్యకు దారితీసిన ఘటన పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రామవరప్పాడుకు చెందిన వైకుంఠం న్యూ ఇయర్ రోజు ఓ శ్మశాన వాటికలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే రోజు వైకుంఠం తాగే చోట సాయి అనే వ్యక్తి ఉండడంతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి తీసుకురాగా.. మళ్లీ వైకుంఠం బయట వెళ్లాడు. మరో సారి ఘర్షణ పడడంతో సాయి కత్తితో హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News January 5, 2025

విజయవాడ: కీలక పదవి రేసులో ఎమ్మెల్యే సుజనా

image

రాష్ట్ర BJP అధ్యక్ష పదవి రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా పేరు కీలకంగా వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షురాలు పురంధీశ్వరికి కేంద్ర క్యాబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నందున సంక్రాంతి అనంతరం బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా బీజేపీ అధ్యక్ష పదవి రేసులో సుజానాతో పాటు MLC పీవీఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, పురిగళ్ల రఘురాం పేర్లు వినిపిస్తున్నాయి.

News January 5, 2025

గన్నవరం: పులి సంచారం కలకలం

image

గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామం బయట పామాయిల్ తోట వద్ద నుంచి కొండగట్టు పైకి తెల్లవారుజామున 3 గంటలకు పులి, దాని పిల్లలు రోడ్డు దాటిందని ఆర్టీసీ కండక్టర్ రవికిరణ్ చెప్పాడు. హనుమాన్ జంక్షన్, ఆగిరిపల్లి సర్వీస్ రూట్‌లో కండక్టర్ రవికిరణ్ తెల్లవారుజామున ఆగిరిపల్లి నుంచి గన్నవరం వస్తుండగా పులి పిల్లలు రోడ్డు దాటుతుండటం చూసి భయాందోళనకు గురైనట్లు తెలిపాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశానన్నాడు.

News January 5, 2025

VJA: డబ్బులు ఇప్పించాలని మహిళ ఆత్మహత్యాయత్నం

image

గుంటూరు జిల్లాకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన విజయవాడ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8 లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలు స్పందనలో ఫిర్యాదు చేయడంతో గుణదల పోలీసులు కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగివ్వకుండా బాధితురాలిపై ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనడబ్బు ఇప్పించాలని వాపోయారు.