News March 8, 2025
VJA: మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోం మంత్రి

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహిళా దినోత్సవ వారోత్సవ వేడుకల్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక మంది మేధావులు, ప్రముఖుల ఆధ్వర్యంలో “మహిళల నాయకత్వం-సవాళ్లు పురోగమించే మార్గం” అన్న అంశంపై ప్యానెల్ డిస్కషన్‌లో భాగస్వామ్యమయ్యారు. మహిళల అభ్యున్నతితో పాటు వారిలోని నాయకత్వ సామర్ధ్యాలను వెలికి తీయడం, వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Similar News
News December 28, 2025
బంగారు కుటుంబాలకు అండగా నిలవాలి: కలెక్టర్

జిల్లాలోని ‘బంగారు కుటుంబాలను’ దత్తత తీసుకుని, వారి ఆర్థిక స్థితిగతులు, మౌలిక వసతుల కల్పన ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈకుటుంబాలను మార్గదర్శులతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
News December 28, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 28, 2025
నా ప్రాణానికి ముప్పు: MLC దువ్వాడ

AP: తన ప్రాణానికి <<18684111>>ముప్పు<<>> ఉందని MLC దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. తనకు ఏమైనా జరిగితే దానికి ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదే కారణమని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం SPని కలిసి ఫిర్యాదు చేశారు. 2+2 గన్‌మెన్‌లను కేటాయించాలని కోరారు. కొద్ది రోజులుగా తనకు ఫోన్‌లో, ప్రత్యక్షంగా బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే వారిని అణచివేయాలనే ధోరణి సరికాదని మీడియాతో అన్నారు.


