News October 4, 2025
VJA: మహిళ స్నానం చేస్తుండగా ఫోటోలు.. వ్యక్తి అరెస్ట్

బాత్‌రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా ఫొటోలు తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ హనుమాన్‌పేటలోని ఓ హోటల్‌లో గత నెల 26న బస చేసిన సూర్యాపేట కుటుంబానికి చెందిన మహిళ స్నానం చేస్తుండగా, పక్క రూమ్‌లోని పల్నాడు జిల్లాకు చెందిన అంకమ్మ రాజు ఫోటోలు తీసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగ మురళి తెలిపారు.
Similar News
News October 4, 2025
‘ఆటో డ్రైవర్ల సేవలో’ స్కీం ప్రారంభించిన CM

AP: ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15,000 చొప్పున ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. డ్రైవర్లకు ఆర్థిక సాయం కింద ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,90,996 మంది డ్రైవర్లకు ఈ లబ్ధి చేకూరనుంది. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
News October 4, 2025
రామగుండం: యూరియా ఉత్పత్తి ప్రారంభం

రామగుండం ఫెర్టిలైజర్స్‌లో యూరియా ఉత్పత్తిని పునరుద్ధరించారు. AUG 14న పైప్‌లైన్ లీక్ వల్ల ప్లాంట్‌ను నిలిపివేశారు. సెప్టెంబర్ 28న మరమ్మతులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించారు. రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియాను తయారు చేస్తున్నారు. పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కొనసాగుతుండగా, HYDకు 25వేల మెట్రిక్ టన్నుల యూరియా రైలు ద్వారా పంపేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.
News October 4, 2025
దేశం విడిచి వెళ్తే 2,500 డాలర్లు: ట్రంప్

వలసదారుల పిల్లలు(14 ఏళ్లు లేదా పైబడిన) US విడిచి వెళ్తే ఒకేసారి 2,500 డాలర్లు(దాదాపు రూ.2.5 లక్షలు) ఇస్తామని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. స్వచ్ఛందంగా దేశాన్ని విడిచివెళ్లడాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఆ పిల్లలు సొంతం దేశం చేరినట్లుగా ఇమ్మిగ్రేషన్ జడ్జి ఆమోదిస్తేనే డబ్బులు చెల్లిస్తామన్నారు. కాగా ఇది క్రూరమైన నిర్ణయమని విమర్శలు వస్తున్నాయి.