News February 14, 2026
VJA: మార్కెట్లో రూ.2 వేలు.. రెడ్ క్రాస్ ఇస్తామన్నా తీసుకోరు..? (1/3)

విజయవాడ GGHలో <<19138621>>బ్లడ్<<>> నిల్వల కొరత రోగులకు భారంగా మారుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధర రూ.1,450, ప్రైవేట్ సంస్థలు రూ.1,800 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నాయి. రెడ్ క్రాస్ వంటి సంస్థలు తక్కువ ధరకే రక్తాన్ని సరఫరా చేస్తామని, ఆసుపత్రిలో ఒక గదిని కేటాయిస్తే నిరంతరాయంగా రక్తం అందిస్తామని ముందుకొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తలసేమియా రోగులకు ఫ్రీగా బ్లడ్ ఇస్తామని రెడ్ క్రాస్ చెబుతోంది.
Similar News
News February 20, 2026
అనకాపల్లి: చిట్టీలు, డిపాజిట్ల పేరుతో మోసం.. దంపతుల అరెస్టు

చిట్టీలు, డిపాజిట్లు, గోల్డ్-సిల్వర్ స్కీమ్‌ల ద్వారా భారీ మోసం చేసిన కలగళ్ల సౌజన్యలత, శ్రీనివాసరావు దంపతులను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం హరిపాలెం గ్రామానికి వచ్చి చిట్టీలు, డిపాజిట్లు, గోల్డ్-సిల్వర్ స్కీమ్‌లు నడిపారు. స్థానికులకు నమ్మకం కలిగిన తర్వాత భారీ మొత్తాలు వసూలు చేసి పారిపోయారు. ఈనెల 9న బాధితులు ఫిర్యాదు చేశారు.
News February 20, 2026
నేడు అల్పపీడనం.. వర్ష సూచన

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతం, భూమధ్య రేఖకు ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి దక్షిణ తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రాయలసీమలోనూ వానలు పడతాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో 22వ తేదీ నుంచి వర్షాలకు ఆస్కారం ఉందని అంచనా వేసింది.
News February 20, 2026
యూరియా, వేపపిండిని కలిపి వాడటం వల్ల లాభాలు

సాధారణంగా పంటకు వేసిన యూరియా త్వరగా ఆవిరికావడం, నీళ్లలో కొట్టుకుపోవడం జరుగుతుంది. దీన్ని వేపపిండితో కలిపి వాడితే యూరియాలో నత్రజని నెమ్మదిగా కరిగి మొక్కలకు స్థిరంగా, ఎక్కువ కాలం పాటు అందుతుంది. దీని వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. నత్రజని వృథా 20-30% తగ్గుతుంది. నేల ఆరోగ్యం పెరిగి, వేరుకుళ్లు, నులి పురుగుల సమస్య తగ్గుతుంది. 50 కేజీల యూరియాకు నిపుణుల సూచనలతో 5KGల వేపపిండి కలపడం మంచిది.


