News November 18, 2025

VJA: రూ.40 వేలకు ఫైనాన్స్.. ఆలస్యానికి రూ.15 వేలు వసూలు

image

విజయవాడ సెంట్రల్‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రూ.40వేల ఫైనాన్స్ తీసుకున్న ఒక వ్యక్తి, ఇప్పటికే రూ.36 వేలు చెల్లించాడు. అయితే, వరదల కారణంగా 3 నెలల పాటు వాయిదా ఆలస్యమైంది. దీంతో లేట్ ఫీజు పేరుతో ఫైనాన్స్ సంస్థ అదనంగా రూ.15వేలు వసూలు చేసినట్లు బాధితుడు తెలిపారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత వాహనాన్ని తిరిగి ఇచ్చేసినా, NOC కోసం వారం రోజులుగా తిప్పుకుంటున్నారని వాపోయాడు.

Similar News

News November 18, 2025

ములుగు: డబ్బులు ఆడిగేందుకు వెళ్తే.. చంపారు!

image

యువతికి ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే వ్యక్తిని <<18308316>>కొట్టి చంపిన ఘటన<<>> ములుగు జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన యువతికి రూ.4 వేలు ఇచ్చాడు. డబ్బుల కోసం తరచూ వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి యువతి ఇంటికి వచ్చిన సమ్మయ్యను.. యువతి తాత, నానమ్మ కలిసి రేకుల షెడ్డు కింద కట్టేసి కొట్టారు. దింతో సమ్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.

HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్‌లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.