News March 1, 2026

VJA: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా యశ్వంత్‌పూర్(YPR)- సంత్రాగచ్చి(SRC) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06233 YPR- SRC రైలు మార్చి 1న, నం.06234 SRC- YPR రైలు మార్చి 3న ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు హిందూపూర్, అనంతపూర్, నంద్యాల, గుంటూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 2, 2026

సంచలన ఆరోపణ.. మావోలపై విషపు తూటాలు?

image

నక్సల్స్‌ను అంతం చేసేందుకు ఎన్‌కౌంటర్లలో విషపు తూటాలు వాడారంటూ ఓ మావోయిస్టు అగ్రనేత ‘ఫినిక్స్’ పేరిట రాసిన కథనం సంచలనం రేపుతోంది. ‘బుల్లెట్ షెల్స్ తగిలిన సహచర మావోలు తీవ్రమైన నొప్పి, భరించలేని మంట, విపరీతమైన దాహం, వాంతులతో నరకం అనుభవించారు’ అని పేర్కొన్నారు. గతేడాది ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌‌ నుంచి తప్పించుకున్న ఆయన పార్టీకి రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించారు.

News March 2, 2026

తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఉన్నం హనుమంతరాయ చౌదరి

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి తీవ్ర అనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే హైదరాబాదులో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చిన ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. డాక్టర్లు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

News March 2, 2026

చౌటుప్పల్: బ్యాంకులో చోరీకి యత్నం.. మోగిన సైరన్

image

చౌటుప్పల్ మండలం ఎల్లం బావిలో గల తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖలో దొంగలు చోరీకి యత్నించారు. సోమవారం తెల్లవారుజామున బ్యాంక్ సైరన్ మోగడంతో పక్కనే ఉన్న ఇళ్ల ప్రజలు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. స్థానికులు వస్తున్నట్లు గమనించిన అనుమానితులు అక్కడి నుంచి పరారయ్యారు. మరింత సమాచార తెలియాల్సి ఉంది.