News December 23, 2025

VJA: రైల్వే మ్యాప్‌లో రాయనపాడు సరికొత్త ముద్ర

image

రాయనపాడు రైల్వేస్టేషన్ సరికొత్త హంగులతో ముస్తాబవుతోంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా, HYDలోని చర్లపల్లి స్టేషన్ తరహాలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 80% పునర్నిర్మాణ పనులు పూర్తికాగా, అత్యాధునిక వసతులతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. వచ్చే ఏడాదికి ఈ స్టేషన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండటంతో, విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందనున్నాయి.

Similar News

News February 10, 2026

విజయనగరం జిల్లాలో 33 వేల ఎకరాల్లో మామిడి సాగు

image

విజయనగరం జిల్లాలో మామిడి పంట 33 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యానవన శాఖాధికారి కే.చిట్టిబాబు తెలిపారు. వాతావరణం సానుకూలంగా ఉండడంతో మంచి ఫలితాలు వచ్చాయాన్నారు. మామిడికి వచ్చే తెగులు కూడా తక్కువుగా ఉండడంతో రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన విధంగా దిగుబడి ఉంటుందన్నారు. పొగమంచు పడడంతో మామిడి పూత రాలిపోకుండా పూత రాలిన చోట మందులు పిచికారి చేయాలని సూచించారు.

News February 10, 2026

విశాఖ సీపీని కలిసిన సింహాచలం ఈవో

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చిని, జీవీఎంసీ కమిషనర్ కేతాన్ గార్గ్‌ను సింహాచలం ఈవో వెంకటరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రానున్న చందనోత్సవ వేడుకలపై వీరు చర్చించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈవోకు జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ సూచించారు.

News February 10, 2026

సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారా?

image

రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ బిల్స్‌లో సర్వీస్ ఛార్జీ వసూలు చేయడం కన్జూమర్ లాను బ్రేక్ చేయడమేనని కేంద్ర వినియోగదారుల సంస్థ(CCPA) పేర్కొంది. ఈ నిబంధనను ఉల్లంఘించినందుకు తాజాగా దేశంలోని 27 రెస్టారెంట్లకు రూ.50వేల వరకు జరిమానా విధించినట్లు తెలిపింది. సర్వీస్ ఛార్జీ పూర్తిగా వినియోగదారుని ఇష్టమని, బలవంతంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. బాధితులు <>NCHలో<<>> ఫిర్యాదు చేయవచ్చు.