News September 15, 2025

VJA: వాట్సాప్‌లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

image

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.

Similar News

News September 15, 2025

త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

image

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News September 15, 2025

KNR: వారికోసం రూ.8వేల కోట్లు చెల్లించలేదా?: బండి

image

ఫీజు రీయంబర్స్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్లం తామేనని చంకలు గుద్దుకున్న కాంగ్రెస్ నేతల నిర్వాకంవల్లే కాలేజీలు మూతపడి లక్షల విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ సుందరీకరణ, 4th సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వానికి లక్షల విద్యార్థుల భవిష్యత్తు కన్పించట్లేదా? వారికోసం రూ.8వేల కోట్లను చెల్లించలేదా? అని ప్రశ్నించారు.

News September 15, 2025

కేసులు పెట్టినా వెనక్కి తగ్గం: మత్స్యకారులు

image

బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపడంటూ మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.