News July 10, 2025
VJA: సాగునీటి అవసరాలకు నీటి విడుదల

కృష్ణా డెల్టా రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి KEB కెనాల్ 1205 క్యూసెక్కులు, బందరు కెనాల్ 1,354 (క్యూ), ఏలూరు కెనాల్ 1216 (క్యూ), రైవస్ కెనాల్ 4001 (క్యూ), KE మెయిన్ 7764 (క్యూ), KW మెయిన్ 1216 (క్యూ), మొత్తం కాలువల ద్వారా 8,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Similar News
News July 10, 2025
నిజాంపేట్‌లో మరో కల్తీ కల్లు కేసు.. గాంధీకి తరలింపు

కల్తీ కల్లు తాగి నిజాంపేట్‌లోని హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న <<17017648>>వి.సుగుణమ్మ(58)<<>>ను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమెకు కూడా ఆ కళ్లు తాగడంతోనే వాంతులు విరోచనాలు కాగా కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మెరుగైన వైద్యచికిత్సల కోసం నేడు 108 సిబ్బంది సతీశ్ శ్రీనివాస్, సహాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
News July 10, 2025
WGL: తీర్థ యాత్రలకు వెళ్లే వారికి ప్రత్యేక రైళ్లు

తీర్థ యాత్రలకు వేళ్లే వారికి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని ఐఆర్సీటీసీ టూరిజం మేనేజర్ పీవీ.వెంకటేశ్ వెల్లడించారు. జూలై 19 నుంచి 26 వరకు ప్రత్యేక ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరుతో హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. యాత్రకి సంబధించిన అన్ని వివరాలను రైల్వే స్టేషన్లలోని ఐఆర్సీటీసీ సెంటర్లలో తెలుసుకోవచ్చని వరంగల్‌లో తెలిపారు.
News July 10, 2025
కాజీపేట ఆర్వోబీని త్వరగా పూర్తి చేయాలి: HNK కలెక్టర్

కాజీపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె కాజీపేట ఫాతిమా నగర్లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తైన నిర్మాణ పనులు, పూర్తి కావాల్సిన పనులకు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.