News July 10, 2025

VJA: సాగునీటి అవసరాలకు నీటి విడుదల

image

కృష్ణా డెల్టా రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి KEB కెనాల్ 1205 క్యూసెక్కులు, బందరు కెనాల్ 1,354 (క్యూ), ఏలూరు కెనాల్ 1216 (క్యూ), రైవస్ కెనాల్ 4001 (క్యూ), KE మెయిన్ 7764 (క్యూ), KW మెయిన్ 1216 (క్యూ), మొత్తం కాలువల ద్వారా 8,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

Similar News

News July 10, 2025

సమ్మక్క సాగర్ UPDATE

image

కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్దగల సమ్మక్క బ్యారేజ్‌లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ కెపాసిటీ 4.968/6.94 టీఎంసీలు కాగా, బ్యారేజీలోకి ఇన్‌ఫ్లో 5,80,430 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీలోని 59 స్పిల్ గేట్ల ద్వారా 5,80,430 క్యూసెక్కుల నీటిని బయటికి పంపిస్తున్నారు.

News July 10, 2025

పెద్దపల్లి: ‘సమిష్టి కృషితో నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలి’

image

సమిష్టి కృషితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం అర్జీ-3, ఏపీఏ ఏరియాల్లో ఆయన పర్యటించారు. జీఎంలు ఎన్.సుధాకరరావు, కె.నాగేశ్వరరావుతోపాటు వివిధ గనుల, విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఉద్యోగుల సంక్షేమం, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల పదోన్నతుల వివరాలను వెల్లడించారు.

News July 10, 2025

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

image

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.