News October 15, 2025
VJA: ‘సూపర్ జీఎస్‌టీ సేవింగ్స్ ఉత్సవాలను వినియోగించుకోండి’

పున్నమిఘాట్‌లో ఈ నెల 13న ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రతిరోజూ లక్కీడ్రా నిర్వహిస్తున్నామని జేసీ ఎస్. ఇలక్కియా తెలిపారు. ఫెస్టివల్ చివరి రోజు బంపర్ డ్రా తీసి విజేతకు స్కూటీ బహూకరిస్తామన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులు తగ్గిన జీఎస్‌టీ రేట్లతో, ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్శీశా, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 15, 2025
ANU: B.TECH సప్లమెంటరీ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జులై 2025లో నిర్వహించిన B.TECH 1&4-1 సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు, PG-2 సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. B.TECH సప్లిమెంటరీ 35.14%, PG MBA ఇంటర్నేషనల్ బిజినెస్ 95%, MPA థియేటర్ ఆర్ట్స్ 45.45% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం అక్టోబర్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 15, 2025
తిరుపతిలో వైసీపీ నాయకుల నిరసన

సోషియల్ మీడియాలో ప్రశ్నించారని వైసీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.
News October 15, 2025
భూపాలపల్లిలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష

భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, సహకార తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ చాలా కీలకమని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు.