News January 22, 2025

VJA: 24 నుంచి జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు

image

విజయవాడ పటమటలోని జిల్లాపరిషత్ బాలుర పాఠశాలలో ఈ నెల 24 నుంచి 27 వరకు జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను DRO ఎం.లక్ష్మీనరసింహారావు మంగళవారం విజయవాడలోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పోటీల్లో 5 రాష్ట్రాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొంటున్నాయన్నారు. పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లక్ష్మీనరసింహారావు వివరించారు.

Similar News

News October 27, 2025

కృష్ణా: మెంథా తుఫాన్.. ప్రత్యేక అధికారులు జాబితా ఇదే.!

image

మచిలీపట్నం-7093930106, అవనిగడ్డ-9704701900, కోడూరు-9490952125, నాగయలంక-8639226587, చల్లపల్లి-9100084656, కృత్తివెన్ను-8331056798, మోపిదేవి-8008772233, బంటుమిల్లి-9100109179, ఘంటసాల-9848933877, గూడూరు-9849588941, పెడన-9154409536, బాపులపాడు-9849906009, గన్నవరం-8333991288, గుడివాడ-8686935686, గుడ్లవల్లేరు-9052852666, తోట్లవల్లూరు-9492555104, ఉయ్యూరు-7995086773, నందివాడ-9989092288.

News October 27, 2025

కృష్ణా: తీరప్రాంత ప్రజలకు మడ అడవులు రక్షణ కవచం.!

image

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంత ప్రజలకు రక్షణ కవచంలా మడ అడవులు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సహజ సంపద నేడు అంతరించిపోతున్న స్థితికి చేరుకోవడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో విపత్తు ప్రభావం తక్కువగా కనిపించిందని, అదేవిధంగా 2004 సునామీ సమయంలో కూడా ఈ మడ అడవులే సహజ రక్షణగా నిలిచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.

News October 27, 2025

కృష్ణా: తుపాన్ బీభత్సం.. చిగురుటాకులా వణికిన దివిసీమ

image

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్‌ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.