News December 22, 2025
VJA: GGHలో దందా.. రోగిని తీసుకెళ్లాలంటే లంచం ఇవ్వాల్సిందే.!

విజయవాడలోని కొత్త,పాత GGHలలో రోగులను వార్డుల్లోకి తరలించే సిబ్బందికి డబ్బులిస్తే కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. క్యాజువాలిటీ నుంచి ఇతర వార్డుల్లోకి మార్చాలంటే రూ.200పైగా వసూలు చేస్తున్నారు. ఇటీవల కృష్ణా(D) కోడూరుకి చెందిన ఓ వ్యక్తి GGHలో మృతిచెందగా వార్డులోంచి పక్కనే ఉన్న మార్చురీకి తరలించేందుకు రూ.1000 డిమాండ్ చేశారు. లంచాలు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Similar News
News December 25, 2025
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ గుట్టు రట్టు

AP: భారీ అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌ను రాష్ట్ర సీఐడీ అధికారులు ఛేదించారు. కంబోడియా నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వియత్నాంకు చెందిన కీలక నిందితుడు హుడేను బెంగాల్‌లో అరెస్టు చేశారు. 1,400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ సాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
News December 25, 2025
సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా షంషుద్దీన్

ముస్లిం సమైక్య వేదిక సత్యసాయి జిల్లా అధ్యక్షునిగా గోరంట్లలోని మల్లాపల్లి గ్రామానికి చెందిన షంషుద్దీన్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించిన ముస్లిం సమైక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అన్వర్, అలాగే మహిళా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మక్బూల్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు.
News December 25, 2025
అనంత జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ఈయనే.!

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బొమ్మనహల్ దర్గా హోన్నూరు గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు హెచ్.ఆనంద్‌ను జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించారు. తాను పార్టీకి, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. ఈ పదవిని ఇచ్చిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.


