News March 30, 2025
VJA: IPL బెట్టింగ్లో మరో నలుగురి అరెస్ట్

అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి, వెంకటరమణ పటమట పోలీసులకు అప్పగించారు. వీరు మొత్తం రూ.48లక్షల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాఫీ షాపులు, కిల్లి కోట్లు కలెక్షన్ పాయింట్లుగా, వాహన నంబర్లతో డబ్బులు లావాదేవీలు చేశారు.
Similar News
News December 6, 2025
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు

బాబ్రీ మసీదు కూల్చివేత రోజు (డిసెంబర్ 6) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని అధికారులు సూచించారు. అనుమానిత వ్యక్తులు, సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు.
News December 6, 2025
గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలి: పవన్

AP: అడవిపై ఆధారపడి జీవించే గిరిజనులకు జీవనోపాధి, ఆదాయ మార్గాలను పెంచాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఉద్యాన పంటలను ఉపాధి హామీ పథకంతో లింక్ చేయాలన్నారు. ‘అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అక్కడ సినిమాలు, సీరియళ్ల షూటింగులకు ప్రోత్సాహం ఇవ్వాలి. దీనివల్ల యువతకు ఉపాధి లభిస్తుంది’ అని పేర్కొన్నారు.
News December 6, 2025
సిద్దిపేట: సర్పంచ్ పోరు.. ఇక్కడ బాల్యమిత్రులే ప్రత్యర్థులు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి పంచాయతీ ఎన్నికల్లో బాల్యమిత్రులు ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్ సర్పంచ్ పదవికి ఒకరిపై ఒకరు పోటీపడుతున్నారు. ఒకే పాఠశాల, ఒకే బెంచీ నుంచి ఎదిగిన వీరి పోరు ఆసక్తి రేపుతోంది. గతంలో భార్య ద్వారా గెలిచిన అనుభవం శ్రీనివాస్కు బలం కాగా, యువత మద్దతు శ్రీధర్కు అదనపు బలంగా ఉంది. ఈ పోటీలో పాత సేవలు గెలుస్తాయా, కొత్త వాగ్దానాలా అనే చర్చ గ్రామంలో జోరుగా సాగుతోంది.


