News March 30, 2025

VJA: IPL బెట్టింగ్‌లో మరో నలుగురి అరెస్ట్

image

అవనిగడ్డ MPP కుమారుడు పవన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శనివారం అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి, వెంకటరమణ పటమట పోలీసులకు అప్పగించారు. వీరు మొత్తం రూ.48లక్షల లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. కాఫీ షాపులు, కిల్లి కోట్లు కలెక్షన్ పాయింట్లుగా, వాహన నంబర్‌లతో డబ్బులు లావాదేవీలు చేశారు.

Similar News

News April 21, 2025

నక్సలిజం అంతమయ్యే వరకూ దాడులు ఆపం: అమిత్ షా

image

నక్సలిజాన్ని తుదముట్టించేంత వరకూ భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.కోటి రివార్డున్న వివేక్ అనే మావోయిస్టుతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారని తెలిపారు. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు విజయం సాధించాయన్నారు. కాగా 2026 మార్చి 31 కల్లా నక్సల్ రహిత దేశంగా భారత్‌ నిలుస్తుందని అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 21, 2025

కరీంనగర్: ధరణిలో పొరపాట్ల సవరణ అధికారం కలెక్టర్‌కే : పమేలా సత్పతి

image

ధరణిలో పొరపాట్లను సవరించడానికి కలెక్టర్ మినహా ఏ అధికారికి అవకాశం లేదని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. సోమవారం గంగాధరలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో భూభారతి, ఆర్వోఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న సమస్యలు వేలసంఖ్యలో పేరుకుపోయాయన్నారు. భూభారతి చట్టం ద్వారా ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.

News April 21, 2025

కామారెడ్డి: ప్రజావాణిలో 108 అర్జీలు: అదనపు కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే డిస్పోస్ చేయాలని పేర్కొన్నారు. ప్రజావాణిలో 108 అర్జీలు వచ్చినట్లు వివరించారు.

error: Content is protected !!