News March 1, 2025
VJA: NCC సూపరింటెండెంట్ ఆత్మహత్యపై కుమార్తె ఆరోపణలు

విజయవాడ కృష్ణానదిలో ఈనెల 27న NCC సూపరింటెండెంట్ విజయలక్ష్మి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె కుమార్తె సాయి శ్రీ భవానిపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణానికి కారణం కమాండర్ బల్విందర్ సింగ్ అని తెలిపింది. బల్విందర్ సింగ్ తన తల్లిని అవహేళనగా మాట్లాడుతున్నాడని, గతంలో తనకు అనేకసార్లు తెలిపిందని, మనస్తాపనతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసింది.
Similar News
News March 1, 2025
ఒంగోలు: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్

ఒంగోలు నగరంలోని 49వ డివిజన్‌లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెన్షన్ నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె. ఆదిలక్ష్మి, ఆర్డీవో కె. లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
News March 1, 2025
‘అఖండ-2’: హిమాలయాలకు బోయపాటి!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇంతకుముందు చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్.
News March 1, 2025
మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.