News March 1, 2025
VJA: NCC సూపరింటెండెంట్ ఆత్మహత్యపై కుమార్తె ఆరోపణలు

విజయవాడ కృష్ణానదిలో ఈనెల 27న NCC సూపరింటెండెంట్ విజయలక్ష్మి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె కుమార్తె సాయి శ్రీ భవానిపురం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణానికి కారణం కమాండర్ బల్విందర్ సింగ్ అని తెలిపింది. బల్విందర్ సింగ్ తన తల్లిని అవహేళనగా మాట్లాడుతున్నాడని, గతంలో తనకు అనేకసార్లు తెలిపిందని, మనస్తాపనతో ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేసింది.
Similar News
News March 1, 2025
‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్ట్’ అని పేరు పెట్టాలని డిమాండ్లు

TG: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ‘రాణి రుద్రమదేవి ఎయిర్ పోర్టు’ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయులు అని, వారి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఆ పేరుతో క్రియేట్ చేసిన ఏఐ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా విమానాలు నడిపించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
News March 1, 2025
పార్వతీపురం: నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు పార్వతీపురం జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని సూచించారు.
News March 1, 2025
సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.