News March 24, 2025

VJA: అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా (పిజిఆర్‌ఎస్‌) అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రజల నుంచి కలెక్టర్ 133 అర్జీలను స్వీకరించారు. అయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌‌లో నమోదవుతున్న అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

Similar News

News April 1, 2025

ఆరుబయట పడుకుంటున్నారా?

image

వేసవి కారణంగా చాలామంది ఆరుబయటో, మేడపైనో పడుకుంటుంటారు. ఒకప్పుడైతే వేసవినాటికి దోమలు పోయేవి. కానీ నేడు విషజ్వరాలను కలిగించే దోమల సంతతి వేసవిలోనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో బయట పడుకునేవారు కచ్చితంగా దోమల తెరను వాడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పడుకునే చోటుకు కొంచెం దూరంలో సాంబ్రాణి ధూపం వేస్తే ఆ వాసనకు దోమలు దూరంగా ఉంటాయంటున్నారు. కాళ్లకు చేతులకు నూనె రాసుకున్నా ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

News April 1, 2025

స్కిన్ క్యాన్సర్‌తో బాధపడ్డా: జాన్ సీనా

image

WWE సూపర్‌స్టార్ జాన్ సీనా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గతంలో తాను స్కిన్ క్యాన్సర్‌ బారినపడ్డట్లు వెల్లడించారు. ‘ఒకసారి డెర్మటాలజిస్ట్ వద్దకు వెళ్లినప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు నా స్కిన్ కింది నుంచి క్యాన్సర్ కణుతులను తొలగించారు. WWE మ్యాచ్‌ల సందర్భంగా నా శరీరంపై మీరు ఆ స్పాట్స్‌ను చూడొచ్చు. మహమ్మారిపై పోరాడే సందర్భంలో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

News April 1, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఘనంగా రంజాన్ వేడుకలు✔రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు✔ఈద్గా వద్ద నాయకుల సందడి✔ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి కావాలి: ముస్లింలు✔రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔తాండూరు: బషీరాబాద్‌లో యాక్సిడెంట్ ✔వికారాబాద్ జిల్లా @ 38 డిగ్రీలు✔రవీంద్ర భారతి ఉగాది వేడుకల్లో వికారాబాద్ ఒగ్గుడోలు

error: Content is protected !!