News March 9, 2025
VJA: కాలేజీలో ఘర్షణ.. తీవ్ర గాయాలు

తాడేపల్లి పరిధి వడ్డేశ్వరంలోని ఓ కళాశాలలో శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సంతోష్ అనే యువకుడిని విజయవాడకు చెందిన హరికృష్ణ గ్యాంగ్‌తో కలిసి దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News March 10, 2025
నిజామాబాద్ జిల్లాకు రూ.600 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు ధీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు రూ.200 కోట్ల చొప్పున రూ.600 కోట్లు మంజూరయ్యాయి.
News March 10, 2025
ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

TG: బీఎడ్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 24వరకు లేట్ ఫీజుతో స్వీకరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, మిగతావారు రూ.750 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
వెబ్‌సైట్: https://edcet.tgche.ac.in
News March 10, 2025
సంగారెడ్డి జిల్లాలో 122 టెన్త్ పరీక్ష కేంద్రాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 122 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సంవత్సరం 22,411 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.