News March 17, 2025

VJA: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

image

10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని గవర్నర్‌పేట సీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి నేపథ్యంలో తాగునీరు, విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News March 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 18, 2025

సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు 

image

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్‌గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్‌వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.

News March 18, 2025

సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమానికి 62 దరఖాస్తులు

image

ప్రజవాణిలో సరైన రీతిలో అర్జీదారులకు సమాధానమిస్తూ పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

error: Content is protected !!