News April 7, 2025
VJA: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అలాగే నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News April 8, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ

కృష్ణాజిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారెక చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నం జిల్లా వ్యాట్ కోర్ట్ అప్పిలేట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జి. గోపిని జిల్లా జడ్జిగా నియమించారు. రాష్ట్రంలో పలువురు జడ్జ్ లను బదిలీ చేయగా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న మొదటి అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు విశాఖపట్నంకు, SC, ST కోర్టు జడ్జి చిన్నబాబు అనంతపురం జిల్లా పోక్సో కోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.
News April 7, 2025
NTR: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. IPL మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 7, 2025
అవనిగడ్డ: పండుగ రోజు విషాదం.. ముగ్గురి మృతి

శ్రీరామ నవమి పండుగ రోజు మోదుమూడిలో ఆనందం కన్నీటిగా మారింది. రాములోరి ఊరేగింపులో భాగంగా కృష్ణా నదిలో రామ స్తూపాన్ని శుద్ధిచేస్తుండగా ముగ్గురు బాలురు నీటమునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడం, ఒకే కుటుంబానికి వారసులుగా ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. వీరబాబు, వెంకట గోపి కిరణ్, వర్ధన్లు మృతిచెందిన వారిలో ఉన్నారు.