News April 23, 2025
VJA: యువతిని బెదిరించి బంగారంతో జంప్

యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్‌లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 23, 2025
KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.
News April 23, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
News April 23, 2025
రాజమండ్రిలో 25న మెగా జాబ్ మేళా

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళి తెలిపారు. APSSDC & ప్రభుత్వం కళశాల (A) రాజమండ్రి సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుందని, సుమారు 30కు పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయని,యువత సద్వినియోగం చేసుకొవాలన్నారు.