News October 3, 2025
VKBజిల్లాలో వైన్ షాప్‌ల టెండర్లకు ఒకే దరఖాస్తు.!

VKB జిల్లాలో 59 వైన్ షాపుల టెండర్లకు ఇప్పటి వరకు ఒకే దరఖాస్తు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 59 వైన్ షాపులకుగాను గత నెల 26 నుంచి 18 వరకు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 25న కేవలం ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. తాండూర్ 18, వికారాబాద్ 12, పరిగి 15, కొడంగల్ 8, మోమిన్‌పేటలో 6 షాప్‌లు ఉన్నాయన్నారు.
Similar News
News October 3, 2025
‘Snapchat’ వాడుతున్నారా?

ప్రస్తుతం యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ‘Snapchat’ యాప్‌లోనూ ఆంక్షలు మొదలయ్యాయి. వినియోగదారులు సేవ్ చేసిన మీడియా(మెమొరీస్) డేటాను కుదించింది. ఇకపై 5GB కంటే ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవాలంటే, తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి. 100GB కోసం నెలకు $1.99 నుంచి చెల్లింపు ప్లాన్‌లు మొదలవుతాయి. లేదా నెలకు $3.99 చెల్లిస్తే 250GB లభిస్తుంది. ఈ నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
News October 3, 2025
యాదాద్రి: దసరా కిక్కు.. రికార్డు స్థాయిలో మద్యం సేల్

యాదాద్రి జిల్లాలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. దసరాకు ముందు మూడు రోజుల వ్యవధిలో ఏకంగా రూ.22,94,60,412 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల్లో 19,640 లిక్కర్ కాటన్లు, 29,301 బీర్ల కాటన్లు కొనుగోలు జరిగినట్లు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి రూ.7 కోట్ల అదనపు మద్యం కొనుగోలు జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
News October 3, 2025
జనగామ: బచ్చన్నపేటలో యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో బొచ్చు క్రాంతి కుమార్ అనే వ్యక్తి వేగంగా కారు నడుపుతున్నాడు. ఇదే సమయంలో బైక్‌పై వెళ్తున్న కందుల అర్జున్(17), శ్రీపతి కృష్ణప్రసాద్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో అర్జున్ మృతిచెందగా కృష్ణప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.