News October 23, 2025
VKB:”తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వేలో పాల్గొనాలి: కలెక్టర్

“తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేలో జిల్లా ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. 2047లో రాష్ట్రం ఎలా ఉండాలనే దిశగా ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిందని తెలిపారు. ప్రజలు తమ విలువైన సూచనలు, సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్ ద్వారా అందించవచ్చని కలెక్టర్ సూచించారు.
Similar News
News October 23, 2025
తాండూర్: ఫేక్ వీడియో కాల్స్‌తో మోసాలు.. జాగ్రత్త: డీఎస్పీ

నకిలీ వీడియో కాల్స్ ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దని ప్రజలకు సూచించారు. కొందరు వ్యక్తులు నగ్నంగా మాట్లాడి, ఆ దృశ్యాలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుంటారని తెలిపారు. ఇలాంటి మోసాలకు భయపడకుండా వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాలని, సైబర్ ఫిర్యాదుల కోసం ‘1930’కు కాల్ చేయాలని డీఎస్పీ కోరారు.
News October 23, 2025
RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.
News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.