News August 27, 2025
VKBలో పూల సాగు.. లాభాల్లో రైతులు

VKB జిల్లాలో రైతులు పూల సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో పూల ధరలు మెరుగ్గా ఉండటంతో పూల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది. జిల్లా వ్యాప్తంగా 2,350 ఎకరాల్లో పూల సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నవాబ్‌పేట్, మోమిన్‌పేట్, పూడూరు, VKB, మర్పల్లి, ధారూర్ తదితర మండలాల్లో పూలను విరివిగా సాగు చేస్తున్నారు. రైతులు పూలను HYDలోని పలు మార్కెట్లకు తరలించి లాభాలను ఆర్జిస్తున్నారు.
Similar News
News August 27, 2025
HYD: పెండింగులో కళ్యాణ లక్ష్మి దరఖాస్తులు!

HYDలో వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందన్నారు.
News August 27, 2025
నల్గొండ: గణనాధుడికి ఘనంగా పూజలు

నల్గొండ ప్రజలకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆమె జిల్లా కేంద్రంలోని రామాలయంలోని మొదటి గణేశ్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
News August 27, 2025
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: KMR కలెక్టర్

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. వరదల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు నిండాయని, ప్రజలు వాటి వద్దకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ప్రయాణాలు మానుకోవాలని, వాగులు, వంకలు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని, చేపల వేటకు, పొలాలకు వెళ్లవద్దని కోరారు.