News December 14, 2025

VKBలో 78.31 శాతం పోలింగ్ నమోదు

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒంటి గంట వరకు 78.31 పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వికారాబాద్ డివిజన్‌లో ఏడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్‌లో 1 గంటల వరకు 78.31 పోలింగ్ నమోదు కాగా 2,09,847 మంది ఓటర్లకు 1,64,330 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అక్కడ ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో ఓటర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడించనున్నారు.

Similar News

News December 15, 2025

JIO నుంచి అదిరిపోయే ప్లాన్స్!

image

న్యూఇయర్ సందర్భంగా JIO కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599తో రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు డైలీ 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు లభిస్తాయి. దీంతోపాటు రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ కూడా 18నెలల పాటు ఉచితం. ₹500తో 28రోజులు డైలీ 2GB, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలతో పాటు పలు OTT ప్లాట్‌పామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ. ₹103తో 28 రోజుల పాటు 5GB డేటా పొందొచ్చు.

News December 15, 2025

జెలెన్‌స్కీ కొత్త ప్రతిపాదన

image

రష్యాతో యుద్ధాన్ని ముగించే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొత్త ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు భద్రతపై హామీ ఇస్తే NATOలో చేరాలన్న ప్రయత్నాలను విరమించుకోవడానికి రెడీ అని ప్రకటించారు. ‘కూటమి సభ్యులకు లభించే తరహాలో భద్రతా హామీలు ఆశిస్తున్నాం. రష్యా మరోసారి ఆక్రమణకు దిగకుండా నిరోధించేందుకు మాకు ఇదో అవకాశం’ అని చెప్పారు. తమ భూభాగాన్ని రష్యాకు వదులుకోవాలన్న US ప్రతిపాదనను నిరాకరించారు.

News December 15, 2025

పాలమూరు: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెంకటాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ 7వ వార్డు సభ్యుడిగా కాంగ్రెస్ మద్దతుదారు మహేష్ విజయం సాధించారు. అయితే, రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో మరణించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.