News January 28, 2025
VKB: అక్రమ రవాణాపై దృష్టి పెట్టండి: జిల్లా ఎస్పీ

జిల్లాలో జరుగుతున్న అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వివిధ మండలాల డివిజన్ పోలీసులతో అక్రమ రవాణాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పీడీఎస్ రైస్, గుట్కా, ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఎప్పటికప్పుడు అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని పోలీస్‌లకు సూచించారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ పాల్గొన్నారు.
Similar News
News February 15, 2025
పర్చూరు: అధికారికి రెండేళ్ల జైలు శిక్ష

దేవాలయాల నిధులను సొంతానికి వాడుకున్న నూతలపాటి శివప్రసాద్ అనే అధికారికి శుక్రవారం జైలు శిక్ష పడింది. పర్చూరు, ఇంకొల్లు మండలాల్లో పనిచేసిన సమయంలో శివప్రసాద్ 4 దేవాలయాలకు సంబంధించిన రూ.88 లక్షలు దుర్వినియోగం చేశారు. ఈ కేసులను విచారించిన పర్చూరు జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శాంతి ముద్దాయికి ఒక్కో కేసులో రెండేళ్ల జైలు శిక్ష, రూ.70 వేల జరిమానా విధించారని ఎస్ఐలు మాల్యాద్రి, సురేశ్ చెప్పారు.
News February 15, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. ఇవాళ పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల

TG: ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లపై క్లారిటీ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా మరోవైపు అధికారులు ఎలక్షన్స్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. 570 ZPTC, 5,817 MPTC స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ ప్రకటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణను పూర్తి చేయాలన్నారు.
News February 15, 2025
పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణరావు వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.