News February 25, 2026

VKB: ఇద్దరు ప్రభుత్వ వైద్యుల తొలగింపు

image

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వికారాబాద్ జిల్లాలోని GMCలో విధులు నిర్వర్తిస్తున్న యశ్వంత్ గౌడ్, విజయశ్రీ ఇద్దరు ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.

Similar News

News April 12, 2026

NZB: ఇంటర్ రిజల్ట్స్‌లో బాలికలదే ఆధిపత్యం

image

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో నిజామాబాద్ జిల్లాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ, ఒకేషనల్ కోర్సుల్లోనూ గర్ల్స్ ఆధిపత్యం చాటారు. జిల్లాలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మొత్తం 13,876 మంది రాయగా, అందులో బాలికలు 7,606కు గాను 5,828 (76.56శాతం) మంది పాస్ అయ్యారు. ఓకేషనల్ కు సంబంధించి 1,002 మంది బాలికలు పరీక్షలు రాయగ 843 (84.13 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.

News April 12, 2026

VJA: శిరిడీ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్!

image

మచిలీపట్నం-సాయినగర్ శిరిడీ (17208) రైలు మార్గంలో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా మే 5న ఈ రైలును విజయవాడ-ఖాజీపేట మార్గానికి బదులుగా, విజయవాడ-గుంటూరు మీదుగా దారి మళ్లించారు. దీనివల్ల ఖమ్మం, వరంగల్, ఖాజీపేట సహా పలు ప్రధాన స్టేషన్లలో ఆ రోజు రైలు నిలవదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

News April 12, 2026

ఇంటర్ రిజల్ట్స్.. ఉమ్మడి ADB ర్యాంకులు ఇవే

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మిశ్రమ ఫలితాలను కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ర్యాంకుల్లో ఆసిఫాబాద్ జిల్లా 82.16% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకొని సత్తా చాటింది. ​మరోవైపు నిర్మల్ జిల్లా 73.43% (13వ ర్యాంకు), మంచిర్యాల 71.63% (19వ ర్యాంకు) సాధించగా, ఆదిలాబాద్ జిల్లా 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి పరిమితమైంది.