News March 30, 2025

VKB: ఉగాది.. షడ్రుచుల సమ్మేళనం.!

image

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉగాది పండుగకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది అంటేనే గుర్తుకొచ్చేది పచ్చడి. ఉగాది పచ్చడి.. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి అనేది జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందని పెద్దల నమ్మకం. ఉగాది/ యుగాది, సంవత్సరాది అని పిలుస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబు చేశారు.

Similar News

News November 1, 2025

ఎల్లుండి నుంచి ప్రైవేటు కాలేజీల బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ₹900Cr చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీలు విధించిన డెడ్‌లైన్ నేటితో ముగిసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎల్లుండి(NOV 3) నుంచి నిరవధిక బంద్‌కు కాలేజీలు సిద్ధమవుతున్నాయి. 2024-25 వరకు ₹9వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దసరాకు ముందు ₹1,200Cr రిలీజ్ చేస్తామన్న ప్రభుత్వం ₹300Cr మాత్రమే చెల్లించిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.

News November 1, 2025

చూపులేని అభ్యర్థుల కోసం స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్

image

దృష్టిలోపం ఉన్న అభ్యర్థుల కోసం పరీక్షల్లో ‘స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్’ ఉపయోగించాలని UPSC నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు అంశాలను పరిశీలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు విజ్ఞప్తి చేసింది. చూపులేని వారికి UPSC సమాన అవకాశాలు కల్పించడం లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టులో పిల్ దాఖలవడంతో కమిషన్ చర్యలు చేపట్టింది.

News November 1, 2025

పేపర్, TV ద్వారా శవరాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలు: CBN

image

AP: YCP ఓ ఫేక్ పార్టీ అని CBN విమర్శించారు. ‘ఆ పార్టీకి ఏం దొరకడం లేదు. ఏ ప్రమాదం జరిగినా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపైనా దుష్ప్రచారం చేశారు. YCPకి ఓ పాంప్లెట్, ఛానెల్ ఉన్నాయి. వాటితో శవరాజకీయం చేస్తోంది. కమ్మ, కాపు మధ్య విద్వేషాలు రగిలించేందుకు యత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. వీటిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉండే అర్హత వారికి లేదన్నారు.