News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
Similar News
News November 16, 2025
తీవ్ర గాయం.. ఐసీయూలో శుభ్మన్ గిల్?

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ <<18294780>>మెడనొప్పితో<<>> బాధపడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేయలేక మైదానాన్ని వీడి వెళ్లారు. అయితే అది తీవ్రం కావడంతో గిల్ను అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచినట్లు తెలుస్తోంది. మెడకు సర్వైకల్ కాలర్తో స్ట్రెచర్పై తీసుకెళ్లడంతో ఆయనకు సివియర్ ఇంజురీ అయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
News November 16, 2025
BBCని వదలని ట్రంప్

మీడియా సంస్థ BBC, US అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదం ముగిసేలా కనిపించడం లేదు. ఆయన మాట్లాడిన వీడియోను తప్పుగా ఎడిట్ చేసినందుకు BBC ఇప్పటికే <<18281054>>క్షమాపణ<<>> చెప్పింది. అయినా ఆయన వదలడం లేదు. 5 బిలియన్ డాలర్ల వరకు దావా వేస్తానని ట్రంప్ ప్రకటించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుగా ప్రసారం చేశారని, నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించారని మండిపడ్డారు. త్వరలోనే బ్రిటన్ PM స్టార్మర్తో మాట్లాడతానని చెప్పారు.
News November 16, 2025
ఈరోజు వీటిని తినకూడదట.. ఎందుకంటే?

కార్తీక మాసంలో ఆదివారం రోజున ఉసిరి, కొబ్బరిని ఆహారంగా తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. ‘ఉసిరి చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. విష్ణు కొలువై ఉండే వృక్షంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి కూడా పవిత్రమైన పూజా ద్రవ్యం. సూర్యభగవానుడికి అంకితమైన ఈ ఆదివారం రోజున ఈ పవిత్ర వృక్షాలను గౌరవించాలి. వాటి ఫలాలను ఆహారంగా స్వీకరించడం ధర్మం కాదని గ్రహించాలి. ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి’ అని సూచిస్తున్నారు.


