News March 14, 2025
VKB: ఎండిపోతున్న పెద్ద చెరువు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దేముల్ మండలంలోని కొండాపూర్ పెద్ద చెరువు ఎండుముఖం పట్టింది. చెరువు ఆయకట్టు కింద సుమారు 90 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తున్నారు. చెరువు ఎండిపోతుండటంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండ్లు పడటంతో నీరు వృథాగా పోతోంది. ఫలితంగా రైతుల పంట పొలాలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని వాపోతున్నారు. చెరువు నీరు వృథా పోకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే మేలవుతుందని రైతులు పేర్కొంటున్నారు.
Similar News
News February 8, 2026
జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

ఈ తెగులు వల్ల జీడిమామిడి చెట్టు ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోతుంది. చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి మ్యాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News February 8, 2026
పాలమూరు: మాజీ కౌన్సిలర్ కిడ్నాప్‌నకు యత్నం

గద్వాల పట్టణంలో పట్టపగలే మాజీ కౌన్సిలర్ మహేశ్వరిని కిడ్నాప్ చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. షాపింగ్ ముగించుకుని బంధువులతో కలిసి ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ ఆటోను దారి మళ్లించి వేగంగా తీసుకెళ్లాడు. అప్రమత్తమైన బాధితురాలు కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఆటోను వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి భర్త సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News February 8, 2026
అనకాపల్లి: ‘దివ్యాంగ విద్యార్థులను ప్రోత్సహించాలి’

దివ్యాంగ విద్యార్థులకు తగిన ప్రోత్సహం అందిస్తే మంచి ప్రతిభను ప్రదర్శిస్తారని డీఈవో అప్పారావు నాయుడు అన్నారు. అనకాపల్లి పట్టణం గుండాల జంక్షన్ వద్ద జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు నిర్వహించిన జిల్లా స్థాయి కల్చరల్, ఆర్ట్ పోటీలను ఆయన ప్రారంభించారు. దివ్యాంగ విద్యార్థుల్లో ప్రతిభ, సామర్ధ్యాలను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు.


