News September 13, 2024
VKB: ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలి
ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ పార్వతాలు సూచించారు. శుక్రవారం మండల పరిధి దేవనూరులో వైఆర్‌జీ కేర్ లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సుఖ వ్యాధులతో ఎయిడ్స్ ప్రబలుతుందన్నారు. ఎయిడ్స్ బాధితుడితో మాట్లాడటం, కలిసి ఉండటం, భోజనం చేయడం వల్ల వ్యాధి సోకదన్నారు.
Similar News
News October 9, 2024
HYD: బస్సులు, రైళ్లు FULL.. వామ్మో కష్టమే..!
హనుమకొండ, వరంగల్, తొర్రూరు, ఖమ్మం సహా ఇతర ప్రాంతాలకు HYD నగరం నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వెళ్తున్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సాయంత్రం వేళ రైళ్లు, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. కనీసం కూర్చునే పరిస్థితి లేదని ప్రయాణికులు వాపోయారు. రైళ్లలో వెళ్తున్న వారు ప్రతి స్టేషన్ ట్రెయిన్ వద్ద దిగి మళ్లీ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News October 9, 2024
HYD: భర్త బయటపెట్టిన వీడియోలపై స్పందించిన దివ్యజ్యోతి
HYD మణికొండ డీఈఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందించారు. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
News October 9, 2024
గ్రేటర్ HYDలో వ్యర్ధాల నిర్వహణకు కమాండ్ కంట్రోల్
గ్రేటర్‌లో ఘన వ్యర్ధాల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు GHMC కమిషనర్ తెలిపారు. వ్యర్ధాల నిర్వహణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వ్యర్ధాల నిర్వహణపై GHMC కమిషనర్ ఆమ్రపాలి అధ్యక్షతన సమావేశం జరిగింది. 11 మంది ఆపరేటర్లు నూతన టెక్నాలజీని వివరించారు. ఈ టెక్నాలజీతో గార్బేజి కలెక్షన్, స్ట్రీట్ స్వీపింగ్, ఫిర్యాదుల పరిష్కారం సులభతరం కానుంది.