News April 11, 2025
VKB: కల్తీలు విక్రయిస్తున్న హోటళ్లకు, స్వీట్ హౌస్‌లకు భారీ జరిమానా

కల్తీలకు పాల్పడుతున్న హోటళ్లకు, స్వీట్ హౌస్‌లకు భారీ జరిమానాలు విధించినట్లు వికారాబాద్ మున్సిపల్ హెల్త్ సూపర్వైజర్ ఇన్ ఛార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. వికారాబాద్ పట్టణంలోని స్వీట్ హౌస్‌లను హోటళ్లను తనిఖీలు చేసి జరిమానాలు విధించారు. గత మూడు రోజులుగా కల్తీలకు పాల్పడుతున్న వారిపై ఇప్పటివరకు రూ.41,500 జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
పార్వతీపురంలో యాక్సిడెంట్.. టీచర్ మృతి

పార్వతీపురం-నర్సిపురం మధ్యలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో టీచర్ మృతి చెందారు. నర్సిపురం హైస్కూల్లో ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తోన్న మరిశర్ల వెంకటనాయుడు విధుల నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగుల్లో ఉన్న అతనిని తోటి వాహనదారులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 18, 2025
గద్వాల్: రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

గద్వాల్ జిల్లా ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఏవైనా సమస్యలు సూచనలు ఉన్న ప్రయాణికులకు బుధవారం డీఎం సునీత నేరుగా అందుబాటులో ఉండనున్నారు. రేపు ఉదయం 11:00 నుంచి 12:00 వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రయాణికులు 9959226290 నంబర్ కాల్ చేయాలన్నారు.
News November 18, 2025
ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?


