News April 14, 2025
VKB: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలకు వరం: స్పీకర్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు వరంగా మారాయని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కమిటీ నియామకం

AP: టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు ఆ పార్టీ అధిష్ఠానం కమిటీని నియమించింది. కమిటీ ఛైర్మన్‌గా సీనియర్ నేత వర్ల రామయ్యను ఎంపిక చేసింది. సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, సవితమ్మ, దగ్గుమళ్ల ప్రసాదరావును నియమించింది. TDP అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వీరిని నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
News April 17, 2025
నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి <
News April 17, 2025
సిద్దిపేట: ‘1100 ఏళ్ల నాటి జైన విగ్రహాన్ని కాపాడుకోవాలి’

నంగునూరు మండలం చిన్నకొండ పైన ఉన్న జైన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్,సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా పేరు ఉన్న జైన విగ్రహాన్ని బుధవారం ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు.1100 సంవత్సరాల చరిత్ర గల జైన విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రం చేయాలన్నారు.