News February 16, 2025

VKB: క్రమశిక్షణతో శిక్షణ పొందాలి: ఎస్పీ

image

క్రమశిక్షణతో కూడిన శిక్షణ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తుందని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ అధికారులకు 15 రోజుల పాటుగా మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శిక్షణ పొందేందుకు వచ్చిన పోలీస్ అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని విధాలుగా పరణితి సాధించాలన్నారు.

Similar News

News November 6, 2025

226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(<>IGMCRI<<>>)లో 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/

News November 6, 2025

ముల్కనూరుకు చేరిన 90 టైర్ల లారీ!

image

భారీ యంత్రాలను మోసుకెళ్లే అతి భారీ వాహనం HNK (D) ముల్కనూర్‌కు చేరింది. ఏకంగా 90 టైర్లతో ఉన్న లారీని చూడటానికి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గుజరాత్‌ నుంచి వరంగల్‌ వరకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ సామగ్రిని ఈ భారీ వాహనం తీసుకువస్తోంది. నెమ్మదిగా కదులుతూ ముల్కనూరుకు చేరిన ఈ లారీ కుడి, ఎడమ వైపులా 40 చొప్పున 80 టైర్లు, ముందున్న ఇంజిన్‌కు 10 టైర్లు కలిగి ఉండడం విశేషం. రోడ్డుపై ఇది ప్రయాణం ప్రజలను ఆకర్షించింది.

News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

image

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.