News February 23, 2025
VKB: క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న కబడ్డీ ప్లేయర్లు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కోరిక మేరకు నిర్వాహకులు స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇండియా, పాక్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందడానికి ఈ ఏర్పాటే నిదర్శనం. ఆదివారం సాయంత్రం కబడ్డీ ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
Similar News
News December 1, 2025
పాతబస్తీలో అండర్గ్రౌండ్ సర్జరీ!

మెట్రో రైలు ఫేజ్-II (MGBS-చాంద్రాయణగుట్ట) కారిడార్లో పాతబస్తీకి శాశ్వత పరిష్కారం దక్కనుంది. కేవలం ఆరు నెలల్లోనే రూ.39.6 కోట్లతో కీలక జల వసతి పనులు పూర్తి చేయాలని HMWSSB నిర్ణయించింది. మైసారం, అలియాబాద్, మిస్రిగంజ్, దారుల్షిఫా, మొఘల్పురా, జంగంమెట్, గౌలిపురా, ఎంఆర్జీ ప్రాంతాల మీదుగా ఉన్న 100-1200 mm డయా తాగునీరు, డ్రైనేజీ లైన్లను మెట్రో పిల్లర్ల మార్గం నుంచి పూర్తిస్థాయిలో మార్చనున్నారు.
News December 1, 2025
‘సీఎంకు వినతి.. కొండగట్టు బాధితులను ఆదుకోండి’

కొండగట్టులో అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాలను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. తక్షణ ఆర్థిక సహాయంతో పాటు మహిళ గ్రూపుల ద్వారా రూ.5 లక్షల రుణ సహాయం, శాశ్వత వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొండగట్టు శాశ్వత అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.