News March 12, 2025
VKB: గ్రూప్-1లో సత్తా చాటిన సౌమ్య

రెండు రోజుల క్రితం TSPSC ప్రకటించిన గ్రూప్-1 సర్వీస్ ఫలితాలలో వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన కెరెళ్లి వెంకట్ రెడ్డి కూతురు సాస్యరెడ్డి అత్యుత్తమమైన ప్రతిభను కనబరిచి 462.5 మార్కులు సాధించారు. ఎంతో కష్టపడి తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించిన తండ్రి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
Similar News
News February 28, 2026
మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
నేడు కాళోజీ కళాక్షేత్రంలో అంతరిక్ష ప్రయోగాలపై సెమినార్

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం మ.2:30 నుంచి 4 వరకు HNK కాళోజీ కళాక్షేత్రంలో సెమినార్ నిర్వహించనున్నారు. అంతరిక్ష ప్రయోగాలపై ప్రముఖ వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భద్రకాళి బండ్ వద్ద రుద్రమ రాకెట్‌ను ఆవిష్కరించనున్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
News February 28, 2026
రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


