News February 13, 2025
VKB: చిరుత ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు

వికారాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై వెళ్లే మార్గంలో రోడ్డుపై అధికారులు అడవిలో చిరుత ఉందని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వీడియోలో కనిపిస్తున్న ప్రాంతం వికారాబాద్ అనంతగిరి అడవిలోనిదే అని డీఎఫ్వో జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. అయితే చిరుత పాదముద్రలు మాత్రం లభించలేదని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలాలకు, అడవులకు ఒంటరిగా వెళ్లకూడదని డీఎఫ్వో సూచించారు.
Similar News
News October 16, 2025
కర్నూలులో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ఓర్వకల్లు వినానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్లో సుండిపెంటకు బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
News October 16, 2025
BREAKING: ఏపీకి చేరుకున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు మోదీకి పుష్పగుచ్ఛాలు అందజేసి వెల్కమ్ చెప్పారు. ప్రధాని అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు.
News October 16, 2025
HZB: ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

హుజూరాబాద్ మండలం రాంపూర్ శివారులో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు చింటూ విలాసాగర్ నుంచి పెద్దపాపయ్యపల్లెకు ఇసుకను తరలించి తిరిగి వస్తున్న క్రమంలో అతివేగం కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టి ప్రమాదం జరిగింది.