News January 30, 2025

VKB: చెల్లింపులకు రేపటి వరకు ఛాన్స్.!

image

వికారాబాద్‌ జిల్లాలో వాహనాల ట్యాక్స్ వసూళ్లపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సకాలంలో ట్యాక్సులు చెల్లించని వాహనాలపై భారీగా పెనాల్టీలు విధించాలని నిర్ణయించింది. ఏకంగా 200శాతం శాతం పెనాల్టీ విధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రవాణా శాఖ అధికారి వెంకట్ రెడ్డి ట్యాక్స్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. త్రైమాసిక పన్నును రేపటి లోపు మీసేవలో, ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. 

Similar News

News February 16, 2025

శ్రీశైలం విశిష్టత మీకు తెలుసా…!

image

ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలక్షేత్రం <<15471616>>రెండోది<<>>. ఈ మందిరంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం కుమారస్వామిని వెతకడానికి క్రౌంచ పర్వతం (శ్రీశైలం) వెళ్లిన శివుడు ఆయన ఉన్నచోటనే లింగరూపంలో వెలిశారు. అక్కడ మద్ది చెట్టుకు మల్లెతీగ అద్దుకొని ఉందట. అప్పటినుంచి స్వామి వారికి ‘మల్లికార్జునుడు’ అని పేరొచ్చిందని స్థలపురాణం పేర్కొంటుంది.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!