News May 23, 2024

VKB జిల్లాలోని రైతులకు పలు సూచనలు!

image

✓ తీరా వర్షాలు కురిసే సమయం వరకు దుక్కులు దున్నకుండా ఉండొద్దు.
✓వేసవిలోనే దుక్కి సిద్ధం చేయడం మంచిది
✓విత్తనం వేసే నెలరోజుల ముందుగానే దుక్కి సిద్ధం చేసుకోండి
✓వేసవి దుక్కులు లోతుగా చేయడం వల్ల, ఎండ వేడికి పలు రకాల చీడపీడ పురుగులు చచ్చిపోతాయి
✓ మొలకెత్తి మొలకల శాతం పెరుగుతుంది
✓ మొలిచిన మొలకలు ఆరోగ్యంగా ఎదుగుతాయి
•పై సూచనలు పాటించాలని AO సూర్య ప్రకాష్ తెలిపారు.

Similar News

News October 1, 2024

HYD: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

ఏడాదికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతికి మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో HYD,RR,VKB,మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా.. పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.

News October 1, 2024

VKB జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు

image

VKB జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. కుల్కచర్ల పాంబండ, కొడంగల్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తాండూరులో భూకైలాస్‌, భద్రేశ్వర ఆలయం, జుంటుపల్లి సీతారాముల దేవాలయం, ఏకాంభరేశ్వరాలయం, పూడూరు దామంగం రామలింగేశ్వర స్వామి, పరిగి వేంకటేశ్వర స్వామి దేవాలయం, వికారాబాద్‌ శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలుగా కొలువయ్యాయి.

News October 1, 2024

HYD జిల్లాలో TOP ర్యాంకర్ల లిస్ట్ ఇదే

image

HYD జిల్లాలో DSC ఫలితాల్లో SGT కే.స్వప్న 89.70, SGT(spl) జే. ఉపేంద్ర-82.90, హిందీ పండిట్ ఆర్.మహాలక్ష్మి-79.97, దత్తాత్రేయ మరాఠీ-49.10, వి.సంపత్ కుమార్ తెలుగు-78.50, యాస్మిన్ ఖానం ఉర్దూ-78.37, బి.సంతోష PET-72.50, ఎస్.తులసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ-82.70, డీ.సాయి దీప్తి ఇంగ్లిష్-79.17, ఆర్.మహాలక్ష్మి హిందీ 71.47, కే.గోపాల్ గణితం-84.87, కే.విద్యాసాగర్ (PE)-66.50 స్కోర్లతో టాపర్లుగా నిలిచారు.