News April 11, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔పలుచోట్ల ఈదురుగాలులతో వర్ష బీభత్సం ✔రేపు పూలే జయంతి వేడుకలు ✔KCR సభకు.. పార్టీ శ్రేణులకు పిలుపు:BRS ✔జిల్లాల్లో జోరుగా వరి కోతలు ✔IPL బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్సైలు ✔పలుచోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం ✔VKB: కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ ✔తహశీల్దార్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిషన్ నాయక్ ✔VKB: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల
Similar News
News April 17, 2026
ఎంపీ వేం నరేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం!

1977 – జనతా పార్టీలో రాజకీయ ప్రవేశం
1983 – తెలుగుదేశం పార్టీలో చేరిక
1994 – మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం
1999 – ఎమ్మెల్యే పోటీకి మరోసారి ప్రయత్నం
2004 – మహబూబాబాద్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం
తరువాత- ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర
2023 – కాంగ్రెస్ వ్యూహాల్లో కీలకంగా వ్యవహారం
2024 – సీఎం సలహాదారుగా నియామకం
2026 – రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం
News April 17, 2026
ASF: మట్టి కుండ నీరే ఆరోగ్య ప్రదాయిని

ఆసిఫాబాద్ జిల్లాలోని పల్లెల్లో మట్టి కుండల వినియోగం క్రమంగా తగ్గుతుండటంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్ నీటి కంటే కుండలో సహజంగా చల్లబడిన నీరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు పేర్కొంటున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా వేసవిలో వడదెబ్బ నుంచి రక్షిస్తుందని వివరిస్తున్నారు. కృత్రిమ పద్ధతులకు దూరంగా ఉండి, సహజమైన చల్లదనాన్ని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
HYDలో భారీ మోసం.. బాధితుల్లో ఎక్కువ వారే

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.


