News March 20, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔TG KHO-KHO జట్టుకు ఎంపికైన పీడీ కే.కవిత(పుట్టపాడు)
✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్
✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
✔VKB: ‘బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుని మార్చాలి’
✔VKB: కొనసాగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం
✔గట్టేపల్లి-నాగ సముందార్ మార్గంలో జింక మృత్యువాత
✔ఇంటి పన్ను..జిల్లాలోనే ప్రథమ స్థానంలో కోట్పల్లి
Similar News
News November 11, 2025
లంకలో హనుమంతుడు ఎడమ కాలు ఎందుకు మోపాడు?

ఆంజనేయుడు, రావణుడి అశుభాన్ని కోరి లంకలో ఎడమ పాదం మోపాడు. దాని ఫలితంగా లంక సర్వనాశనం అయింది. ఎడమ పాదం అశుభాలు, విభేదాలకు దారి తీస్తుంది. దీనికి విరుద్ధంగా, మన సంప్రదాయం ప్రకారం కుడిపాదం మోపి ఇంట ప్రవేశించడం సకల శుభాలకు, సంపదకు ప్రతీక. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింట కుడి కాలు మోపడం వలన శాంతి, ఉన్నతి, సంతోషం కలుగుతాయి. కాబట్టి, ఇతరుల బాగును, క్షేమాన్ని కోరుతూ ఎల్లప్పుడూ కుడిపాదాన్నే ఉపయోగించాలి.
News November 11, 2025
మణుగూరులో 4,000 ఉద్యోగాలకు జాబ్ మేళా

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మణుగూరులో జరగనున్న జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. భద్రాద్రి స్టేడియంలో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ మేళాకు 100కు పైగా కంపెనీలు హాజరవుతాయని తెలిపారు. ఈ మేళా ద్వారా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
News November 11, 2025
రోడ్లపై గుంతలు లేకుండా చేయండి: చంద్రబాబు

AP: రోడ్డు ప్రమాదాల నివారణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. హెల్మెట్, సీట్ బెల్టు లేకుండా వాహనం నడుపుతున్న వారికి అవగాహన కల్పించాలని, అవసరమైతే వారి మొబైల్స్కి సందేశాలు పంపాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు లేకుండా యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయాలన్నారు.


