News March 20, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు
✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు
✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
✔ముగిసిన ఇంటర్ పరీక్షలు
✔VKB: పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ
✔42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం: స్పీకర్
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు
✔హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్
✔యువవికాసం కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్
Similar News
News March 31, 2025
గ్రూప్-1లో రఘునాథపల్లి యువకుడికి 332వ ర్యాంకు

గ్రూప్-1 ఫలితాల్లో రఘనాథపల్లి యువకుడు సత్తా చాటారు. కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు ఉదయ్ ఆదివారం TGPSC ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో 463 మార్కులు సాధించి 332వ ర్యాంకు పొందారు. ఈయన ప్రస్తుతం సింగరేణిలో పర్సనల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఉదయ్ సోదరుడు ప్రణయ్ 2023లో IASగా ఎంపికై ప్రస్తుతం HYDలో పోస్టింగ్ తీసుకున్నారు. ఉదయ్ గ్రూప్-1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News March 31, 2025
BREAKING: రేపు సెలవు ప్రకటన

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఆప్షనల్ హాలిడే (ఐచ్ఛిక సెలవు) ఇస్తూ సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నివేదిక మేరకు రంజాన్ పర్వదినం అనంతరం రోజైన ఏప్రిల్ 1ని ఐచ్ఛిక సెలవు దినంగా పేర్కొన్నారు. అటు తెలంగాణలో రేపు పబ్లిక్ హాలిడే ఉంది.
News March 31, 2025
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి సమీపంలోని దిబ్బగుడివలస – గుమ్మడివరం మధ్యలో రైలు పట్టాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు తెలిపారు. సదరు వ్యక్తి రైలు నుంచి జారిపడడంతో తీవ్రంగా గాయపడి మృతిచెంది ఉంటాడని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని ఎవరైనా గుర్తిస్తే బొబ్బిలి రైల్వే పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.