News March 25, 2025

VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు ✔కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు ✔పంట నష్ట నివేదికను పంపించండి: కలెక్టర్ ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔వికారాబాద్: 26న 148 వాహనాల వేలం ✔పలుచోట్ల భారీ వర్షం ✔ప్రజావాణికి 116 ఫిర్యాదులు: కలెక్టర్ ✔తాండూరు: మాజీ MLA ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు ✔కుల్కచర్ల: ఉపాధి హామీ దిమ్మె కూలీ 4ఏళ్ల చిన్నారి మృతి ✔జడ్పీలో 16 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత.

Similar News

News September 18, 2025

ఇద్దరు MBBS విద్యార్థుల ఆత్మహత్య

image

AP: విశాఖ గీతం మెడికల్ కాలేజీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థి విస్మాద్ సింగ్ (20) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. నిన్న కాలేజీ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకున్నాడు. ‘ఈ లోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దు’ అని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు MBBS ఫస్టియర్‌లో ఫెయిలైన విశాఖ NRI కాలేజీ స్టూడెంట్ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంది.

News September 18, 2025

HYD: ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి: కమిషనర్

image

HYD సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (H-CITY) స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్(SNDP) పనులను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా పెండింగ్ పనులపై ఇంజినీర్లు ఫోకస్ పెట్టాలని సూచించారు.

News September 18, 2025

HYD: నీటి నాణ్యత పరీక్షలపై జలమండలి ఫోకస్

image

జీహెచ్ఎంసీ నుంచి ORR వ్యాప్తంగా నల్లా నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే క్లోరినేషన్ ప్రక్రియ, పంపింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిని పరిశీలిస్తోంది. అనేకచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్లోరిన్ బిల్లల సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. నెలకు లక్షకుపైగా శాంపిల్స్ సేకరిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.