News October 1, 2024

VKB జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు

image

VKB జిల్లాలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు ఉన్నాయి. కుల్కచర్ల పాంబండ, కొడంగల్‌ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తాండూరులో భూకైలాస్‌, భద్రేశ్వర ఆలయం, జుంటుపల్లి సీతారాముల దేవాలయం, ఏకాంభరేశ్వరాలయం, పూడూరు దామంగం రామలింగేశ్వర స్వామి, పరిగి వేంకటేశ్వర స్వామి దేవాలయం, వికారాబాద్‌ శ్రీ బుగ్గరామలింగేశ్వర ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలుగా కొలువయ్యాయి.

Similar News

News October 1, 2024

సోనూసూద్ వద్దకు దామగుండం సమస్య

image

దామగుండం అటవీ సమస్యను పూడూరు నాయకులు నటుడు, సామాజికవేత్త సోనుసూద్‌కు వివరించారు. వికారాబాద్ జిల్లా పూడూరు దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటైతే అడవి పూర్తిగా నాశనం అవుతుందని వాపోయారు. దీని ఏర్పాటుకు అడవిలో మొక్కలు, వృక్షాలు నరికేస్తారని, మూగజీవాలు అంతరించిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని గురించి పరిశోధించి ఆ తర్వాత కార్యచరణ చెబుతానని ఆయన భరోసా ఇచ్చారు.

News October 1, 2024

HYD: వచ్చే వేసవి కోసం రూ.384 కోట్లతో ప్రణాళిక

image

గ్రేటర్ HYD, RR, మేడ్చల్ ప్రాంతాల్లో వచ్చే వేసవిలో కరెంటు లోడు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేసవి కార్యాచరణపై విద్యుత్ సంస్థ దృష్టి పెట్టినట్లుగా ఎండి ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. రూ.384 కోట్లతో HYD, మేడ్చల్, రంగారెడ్డి జోన్లలో ప్రత్యేక 33/11KV ఉప కేంద్రాల ఏర్పాటు, ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

News October 1, 2024

HYD: రూ.కోట్ల డ్రగ్స్ దందా.. దేశవ్యాప్తంగా లింకులు!

image

HYD నగరం నుంచి డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాల సభ్యులకు దేశవ్యాప్తంగా లింకులు ఉన్నట్లు బయటపడింది. గంజాయి, అల్ఫ్రాజోలం, ఎంఫిటమైన్, MDM, హాష్ ఆయిల్ సహా అనేక రకాల డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రంలో విక్రయిస్తున్న ముఠా సభ్యులకు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పలు విచారణల్లో వెల్లడైంది. HYD నగరంలో డ్రగ్స్ దందాను ఒక వ్యాపారంగా చేస్తున్నారు.