News March 27, 2025
VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.
Similar News
News April 2, 2025
ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.
News April 2, 2025
‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
News April 2, 2025
నారాయణపేట: ‘ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజం’

ఉద్యోగులుగా విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించిన రాజా రామ్ ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో రాజా రామ్ దంపతులకు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో చేసిన సేవలను కొనియాడారు. శేష జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, ప్రజా సేవ చేయాలని కోరారు. సిబ్బంది పాల్గొన్నారు.